కాపి రాగం త్రిపుట తాళం
ప: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ॥ దినమే ॥
చ 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి
చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ ॥ దినమే ॥
చ 2: అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ
సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ ॥ దినమే ॥
చ 3: నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు
వరుని పదముల నమర పూజించిన ఆ ॥ దినమే ॥
చ 4: మృదంగ తాళము తంబురశృతి గూర్చి
మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ ॥ దినమే ॥
చ 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ
మనమున శ్రీరాముని చింతించిన ఆ ॥ దినమే ॥
చ 6: భక్తులతో ననురక్తిని గూడక
భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా ॥ దినమే ॥
చ 7: దీనశరణ్య మహానుభావ యోగానలోల
నను కరుణింపుమని కొలుచు ఆ ॥ దినమే ॥
చ 8: వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని
వాసుదేవు వాంఛతోను పాడెడి ఆ ॥ దినమే ॥
చ 9: అక్కరతోడ భద్రాచలమునను
చక్కని సీతారాములను చూచిన ఆ ॥ దినమే ॥